కొల్లాపూర్‌కు ఆర్ అండ్ బీ సబ్ డివిజన్ మంజూరు

by S Gopi |   ( Updated:2022-12-27 14:57:50.0  )
కొల్లాపూర్‌కు ఆర్ అండ్ బీ సబ్ డివిజన్ మంజూరు
X

దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ నియోజకవర్గానికి ప్రభుత్వం ఆర్ అండ్ బీ సబ్ డివిజన్ ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ అండ్ బీ సబ్ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత గురించి ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రభుత్వానికి నివేదికను పంపడంతో ఈ మేరకు సబ్ డివిజన్ మంజూరు అయ్యింది. సబ్ డివిజన్ మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story