నేలపాలైన మిర్చి.. అకాల వర్షంతో ఆందోళనలో రైతన్నలు

by samatah |
నేలపాలైన మిర్చి.. అకాల వర్షంతో ఆందోళనలో రైతన్నలు
X

దిశ , మానవపాడు : అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి మిర్చి రైతులు కుదేలయ్యారు. పంట చేతికి వచ్చే అమ్ముకునే సమయానికి అకాల వర్షం మిర్చి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. అలంపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి కురిసిన భారీ వర్షాలకు మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది దిగుబడితో పాటు మిర్చి ధర బాగానే ఉన్నదనే ఆనందంలో ఉన్న రైతులకు అకాలవర్షాలు ఆందోళనను మిగిల్చాయి. మానవపాడు, ఇటిక్యాల, ఉండవెల్లి మండలాల్లోని మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలతో నష్టపోయిన తమకు న్యాయం చేసి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా మిర్చి పంటను ప్రతి ఏడాది సాగు చేస్తారు. సాగుచేసిన మిర్చి పంటలు పంట పొలాల్లో లేదా కళ్ళల్లో నిలువ ఉంచుకొని వాటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఈ ప్రాంతంలో ఏర్పడింది.

ప్రతి ఏడాది లేదా విధంగా పంటలు పండించుకున్న

వాటిని అమ్ముకోవడానికి మాత్రం ఇతర రాష్ట్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఇక్కడ. కనీసం ఏసి గోదాంలో నిల్వ ఉంచుకుందామన్న స్తోమత లేకపోవడం, అక్కడ కూడా నిలువ చేసుకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ సబ్సిడీ తాటిఫామ్ లు ఇవ్వకపోవడం... అమ్ముకోవడానికి మార్కెట్ లేకపోవడంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఇప్పటికైనా పాలకులు స్పందించి అలంపూర్ నియోజకవర్గానికి మిర్చి మార్కెట్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా నష్టపోయిన రైతుల జాబితాను మండల స్థాయి అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తే కాసో కూసో పరిహారం వస్తుందని రైతులు ఆశపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed