- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సోషల్ మీడియాలో పొలిటికల్ వార్.. రెచ్చగొట్టేలా పోస్టులు
దిశ ప్రతినిధి,నాగర్ కర్నూల్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ ముఖ్య నేతలు, ఎన్నికలలో పోటీ చేయనున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులకు మద్దతుగా సోషల్ మీడియాలో వార్ సాగుతున్నది. ఎన్నికల బరిలో దిగుతున్న నేతలు ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు సోషల్ మీడియా వారియర్స్‌లను ఉపయోగిస్తున్నారు. కానీ కనీస అర్హత అవగాహన లేకుండా కొత్త రకమైన యాప్‌ను ఉపయోగించి చేస్తున్న వ్యాఖ్యానాలు విద్వేషాలను రగులుస్తున్నాయి. దీంతో పొలిటికల్ నేతలకు లాభనష్టాలను పక్కన పెడితే సామాన్య జనం మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి దాపురించింది. కులమతాలు, వర్గాలు మధ్య చిచ్చుపెట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల ఎన్నికల ప్రశాంతత కోల్పోయే ప్రమాదంలో పడిందనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులకు పోలీసులకు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలోనూ కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని నాగర్ కర్నూల్ కొల్లాపూర్, అచ్చంపేట పరిధిలో 793 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 80కి పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో కొంతమంది అవగాహన లేకుండా చేస్తున్న పోస్టులు ఇటు రాజకీయంగా విద్వేషాలు మరోవైపు ప్రజల్లోనూ ఆందోళనలను కలిగిస్తున్నాయి.
ప్రచారాస్త్రంగా సోషల్ మీడియా వినియోగం
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అధికార,ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు తమ ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు సోషల్ మీడియాను వేదిక చేసుకున్నారు. సమాజం , వ్యక్తిత్వాల పట్ల అవగాహన లేని వ్యక్తులను సోషల్ మీడియా వారియర్స్ గా నియమించుకోవడంతో అభ్యర్థులకు జరిగే లాభం కంటే నష్టమే రెట్టింపువుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కులాలు మతాలు వర్గాల మధ్య రెచ్చగొట్టే పోస్టులను పెట్టడంతో ఇప్పటికే జిల్లాలో వందల సంఖ్యలో కేసులు నమోదు అయినట్లు పోలీసు అధికారులు చెప్తున్నారు. సోషల్ మీడియా మంచికంటే చెడుకే ఎక్కువగా వాడుతుండడంతో పోటీలో ఉండే అభ్యర్థులకు కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. గత ఐదు రోజుల క్రితం ఎన్నికల సమీక్షలో జిల్లా అధికారులు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించే క్రమంలో సోషల్ మీడియా ఇతర గొడవల కారణంగా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వాటిని గుర్తించే పనిలో పడ్డారు. కాగా కొన్ని నియోజకవర్గాలలో తమ తమ అభిమాన నాయకులు, ప్రజా ప్రతినిధులకు మద్దతుగా పెడుతున్న పోస్టులు పరస్పరం భౌతిక దాడులకు పాల్పడేలా చేస్తున్నాయి. మరోవైపు ఒక నాయకుని అభిమానులు మరో నాయకునిపై పెట్టే పోస్టులు ఆయా పార్టీలు,నాయకుల మధ్య విద్వేషాలను ప్రకటిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో జిల్లా పోలీసు యంత్రాంగం సోషల్ మీడియా, సోషల్ మీడియా వారియర్స్ పట్ల దృష్టి సారించి ఎవ్వరి మనోభావాలకు ఆటంకాలు కలుగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రెచ్చగొట్టే పోస్టులు పెడితే శిక్ష తప్పదు
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కనీస అవగాహన లేని వ్యక్తులు కుల మత వర్గాలు రాజకీయ నేతల మధ్య రెచ్చగొట్టే విధమైన పోస్టులను సోషల్ మీడియాలో పెడితే అట్టి వారిపై కఠినమైన చర్య తప్పదు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇక నుంచి సోషల్ మీడియాలో ఇష్టారీతిగా పోస్టు పెట్టిన వారి సమాచారం ఇవ్వండి.
కే.మనోహర్, జిల్లా ఎస్పీ నాగర్ కర్నూల్