మాజీ వైస్ చైర్మన్ పై పోలీసులకు ఫిర్యాదు..

by Naveena |
మాజీ వైస్ చైర్మన్ పై పోలీసులకు ఫిర్యాదు..
X

దిశ,అమరచింత: వనపర్తి జిల్లా అమరచింత పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జీ ఎస్ గోపిపై స్థానిక మున్సిపల్ కమిషనర్ రవి బాబు మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవి బాబు మాట్లాడుతూ.. కార్యాలయంలో విధుల్లో ఉన్న తనను ఎల్ఆర్ఎస్ కట్టించుకోవద్దని,ఒక వేళ కట్టించుకుంటే నీవు ఇక్కడ ఎలా విధులు నిర్వహిస్తావో చూస్తానని,మాజీ వైస్ చైర్మన్ జీఎస్ గోపి బల్ల గుద్ది బెదిరింపులకు పాల్పడడం భయాందోళన కలిగించిందని కమిషనర్ రవి బాబు తెలిపారు. భోజనానికి వెళ్తున్న సమయంలో జీఎస్ గోపి ఉద్దేశ పూర్వకంగా తనతో గొడవకు రావడం గమనించి,అక్కడి నుంచి ఇంటికి వెళ్లినా.. వినకుండా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్ఆర్ ఎస్ కట్టించుకోవడం జరుగుతుందని అనడంతో.. అయితే నీవు కలెక్టర్ కార్యాలయంలోనే విధులు నిర్వహించు, ఇక్కడ ఎలా విధులు నిర్వహిస్తావో నీ అంతు చూస్తానని అమర్యాదగా కులం పేరుతో దూషించాడని పోలీస్ ల ఫిర్యాదులో పేర్కొన్నట్లు కమిషనర్ తెలిపారు. అనంతరం మాజీ వైస్ చైర్మన్ జీ ఎస్ గోపి,సీపీఎం పార్టీ ఆత్మకూర్ మండల కార్యదర్శి ఎస్ రాజు లు కమిషనర్ మున్సిపల్ సిబ్బంది పై పోలీస్ లకు ఫిర్యాదు చేశారు.

Next Story