అంబేద్కర్ అంటే అంత అలుసా ?

by Sumithra |
అంబేద్కర్ అంటే అంత అలుసా ?
X

దిశ, ఉప్పునుంతల : నేడు దేశచరిత్రలో గర్వించదగ్గ మహా గొప్పనేత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతి, ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ కార్యాలయాల్లో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించి నివాళులర్పించి ఆ మహానేతకు వందనాలు సమర్పిస్తారు. కానీ ఉప్పునుంతల మండలంలోని జప్తిసదగోడు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ఉంది. భారత రాజ్యాంగ నిర్మాతకు కనీస గౌరవం ఇవ్వకుండా గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో అంబేద్కర్ సంఘం కమిటీ అధ్యక్షులు మొలగర శేఖర్, ఉపాధ్యక్షుడు బింపాకుల జంగయ్య, సభ్యులు అంకురి నరేష్, బింపాకుల నగేష్, మొలగర అఖిల్, కృష్ణ, ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలు బాధ్యత మరచి అంబేద్కర్ ను అవమానించారని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్రామసర్పంచ్ గ్రామంలో నివాసం ఉండకుండా అచ్చంపేట పట్టణంలో నివాసం ఉంటూ గింజల మార్కెట్ యార్డులో కమిషన్ ఏజెంట్గా తమ విధులు నిర్వహిస్తూ వ్యాపారానికి అధిక ప్రాధాన్యత కనబరుస్తున్నాడని వారు ఆరోపించారు. దీంతో ఇప్పటివరకు మూడు నెలలుగా గ్రామానికి చుట్టం చూపుగా వస్తున్నాడే తప్ప గ్రామంలో ఉన్నప్రజా సమస్యలు అభివృద్ధి పై ఎలాంటి మక్కువ లేకుండా అతని వ్యవహార శైలి ఉంటుందని వారు పేర్కొన్నారు. ప్రముఖుల ప్రత్యేక కార్యక్రమాలు చేయకుండా తమకేం పట్టనట్లు వ్యవహరించే సర్పంచ్ పంచాయితీ కార్యదర్శి పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story