- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీలు తలుచుకుంటే ఏ కులపోడు ఎమ్మెల్యే కాలేడు : ఈటెల రాజేందర్
దిశ ప్రతినిధి నాగర్ కర్నూల్ / కొల్లాపూర్ : తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఏకమై గట్టిగా తలుచుకుంటే ఏ పార్టీలోనూ మరేకులపాడు ఎమ్మెల్యే కాలేడని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం కొల్లాపూర్ ప్రాంతంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ ఆత్మ గౌరవ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రెండు శాతం కాదు సింహభాగం ఓటర్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలవే నని మా ఓట్లు మేమే వేసుకొని బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకుంటామన్నారు. నీ ప్రభుత్వంలో ఏనాడైనా ఎస్సీ, ఎస్టీ, బీ,సీ మైనార్టీలకు ముఖ్యమంత్రి కుర్చీలు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సింహభాగం ఓటర్ల సంఖ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుపేద అణగారిన వర్గాల వారు మిగతా కులాల వారిచేత అణిచివేతకు గురవుతున్నారని, మన చేతిలో అధికారం ఉంటేనే మనం అన్ని రంగాల్లో ముందుంటామని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంత మామిడి రైతుల మార్కెట్ సౌకర్యం కోసం తాను వెన్నంటే ఉంటానంటూ పిలుపునిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వల్లనే బీసీలకు సముచిత స్థానం గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగం రాకపోగా కనీసం ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ కూడా నెరవేర్చలేకపోయాడని మండిపడ్డారు. బీసీ బిడ్డలకు అధికారం ఇస్తే ప్రతి ఒక్కరికి నివాస గృహాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.