- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి : దేవరకద్ర ఎమ్మెల్యే
దిశ,మదనాపురం: పాఠశాలలో విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఉపాధ్యాయులకు ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాటర్ ప్లాంట్ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్య బోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. డైట్ కర్మోటిక్ చార్జీలను పెంచిందని ఎన్నడూ లేని విధంగా మొదటి రోజే పాటే పుస్తకాలను అందజేశామని ఆయన అన్నారు.వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన మాజీ ఎంపీపీ పద్మావతి వెంకటనారాయణ అభినందించారు. అనంతరం జిల్లా స్థాయి సీఎం కప్పు విజేతల బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ప్రశాంత్, మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగన్న, నాయకులు వడ్డే కృష్ణ, జగదీష్, ఆవుల రాఘవేంద్ర, చుక్క మహేష్, రామకృష్ణ, శేఖర్ రెడ్డి, వేమన, సత్య శిలా రెడ్డి, రవీందర్ రెడ్డి, పావని, శాంతన్న, తదితరులు పాల్గొన్నారు.