- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నికలు బహిష్కరించిన మైలారం గ్రామస్తులు
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారంలో గ్రామంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గత 20 రోజుల క్రితం ఎన్నికలు ఎన్నికలు బహిష్కరిస్తున్నామని గ్రామస్తులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామంలో ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్ ప్రక్రియ ఓటరు బయటికి రాకపోవడంతో పోలింగ్ కేంద్రం వెలవెలబోయింది. పోలింగ్ 179వ కేంద్రంలో ఒక్క ఏజెంట్స్ లేక పోవడంతో కేవలం ఎన్నికల అధికారులు మాత్రమే ఉన్నారు.
మైలారం గుట్టపై మైనింగ్‌కు అనుమతి రద్దు చేసినట్టు ప్రభుత్వం ప్రకటిస్తేనే ఓటింగ్‌లో పాల్గొంటామని గ్రామస్తులందరూ పార్టీలకతీతంగా ఒకటై కొద్ది రోజులపాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామస్తులందరూ మూకుమ్మడిగా ఓటింగ్ బహిష్కరణ నిర్ణయానికి కట్టుబడి సోమవారం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా ఎవరు బయటికి రాకుండా ఇంటి వద్దకే పరిమితమయ్యారు. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని మొన్నటి వరకు ఎన్నికల అధికారులు గ్రామానికి వెళ్లి ప్రజలను అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన వారి సత్ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మైలారం గ్రామస్తులు తీసుకున్న నిర్ణయంపై జిల్లా రాష్ట్ర యంత్రాంగం నిశితంగా పరిశీలిస్తుంది. ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.