- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాల్య వివాహ నిర్మూలన ఉద్యమం నిరంతరం సాగుతుంది: ఆర్డీఎస్ జిల్లా అధ్యక్షురాలు
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: 2030 నాటి వరకు దేశంలో బాల్య వివాహాలు పూర్తిగా నిర్మూలించే వరకు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఉద్యమం నిరంతరంగా సాగుతుందని సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ అన్నారు. ఆదివారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాల నిర్మూలనకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి,గద్వాల,మహబూబ్ నగర్ జిల్లాలోని మండలాలు,గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, జిల్లాలోని 50 గ్రామాల్లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తమ సొసైటీ ర్యాలీలు,సదస్సులు,ప్రతిజ్ఞ కార్యక్రమాలను జిల్లా యంత్రాంగంతో నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనేది జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ లో భాగమని,ఇది బాలల హక్కుల రక్షణ కోసం పనిచేస్తుందన్నారు. ఇది దేశ వ్యాప్తంగా 400కు పైగా,జిల్లాలో 250కి పైగా చైల్డ్ ప్రొటెక్షన్ ఎన్జీవో పార్టనర్ల జాతీయ నెట్వర్క్ 'జస్ట్ రైట్స్ ఫర్' చిల్డ్రన్ (జెఆర్సీ) కూటమిలో పార్టనర్ గా ఉందని ఆమె తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ కాంత్,శ్రీలక్ష్మీ,కన్నన్ రాజ్,జయభారతి,చెన్నమ్మ లు పాల్గొన్నారు.