'కేటీఆర్ సహాకారంతో కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందాం'

by samatah |
కేటీఆర్ సహాకారంతో కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందాం
X

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని రాష్ట్ర మున్సిపల్ శాఖమాత్యులు కేటీఆర్ సహకారంతో కొల్లాపూర్ మున్సిపాలిటీనీ అభివృద్ధి చేసుకుందాం అని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో గురువారం కొల్లాపూర్ పట్టణంలోని (07)ఎడవ వార్డులో పర్యటించాడు.

ఎమ్మెల్యే వార్డు కౌన్సిలర్ బరిగెల రాముడు‌తో కలిసి పట్టణంలోని ఏడవ వార్డులో పర్యటించారు. ఎమ్మెల్యే ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ డ్రైనేజీ సిస్టం తాగునీరు కరెంట్ అలాగే పలు సమస్యల గురించి వార్డు ప్రజలను అడిగి తెలుసుకుంటూ.. సత్వర పరిష్కారానికై నిరంతరం కృషి చేస్తానని వార్డులో ఎలాంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అలాగే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కొల్లాపూర్ మునిసిపాలిటీ దినదిన అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ఏడవ వార్డు ప్రజలతో అన్నారు. సారూ మీ పాలనలో కరెంటుకు గాని తాగునీటి సమస్య గాని డ్రైనేజీకి ఎలాంటి సమస్యలు లేవని ఎడవ వార్డు ప్రజలు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు..కొల్లాపూర్ పట్టణ ఏడవ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story