- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ ప్రభుత్వం అబద్ధాల మాటలలో ప్రపంచ రికార్డు : అమిత్ షా
దిశ, గద్వాల ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని, ప్రతి పథకం లో కోట్ల రూపాయల అవినీతికి కేసీఆర్ పాల్పడ్డారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీ కే అరుణ అధ్యక్షతన బీజేపీ ఆధ్వర్యంలో సకల జనుల విజయ సంకల్ప సభ పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.....రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే డబల్ ఇంజన్ సర్కార్ తో.. మోడీ సహకారంతో తెలంగాణ సమగ్ర అభివృద్ధికి దోహదం పడుతుందని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వానికి వీఆర్ఎస్ తీసుకునే సమయం ఆసన్నమైందని అన్నారు. గద్వాల్ నియోజకవర్గం లో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని , అబద్దాలు చెప్పడం లో కేసీఆర్ ప్రపంచ రికార్డ్ సాధించారు అని అన్నారు. తెలంగాణ లో అధికారం లోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని మోడీ ప్రకటించారని దానికి కట్టుబడి ఉన్నామన్నారు. .కేంద్ర ప్రభుత్వ మంత్రులలో 27 మంది మంత్రులు బీసీలు ఉన్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేశారని,పేపర్ లీకేజ్ చేసి వారి ఆత్మహత్యలకు కారణమైనారన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం లో అమలులో వున్న ముస్లిం రిజర్వేషన్ ను రద్దు చేస్తామని ఆయన తెలిపారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా ఉన్నదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అయోధ్య లోని రామాలయం ఉచితంగా దర్శనం చేపిస్తమని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఓ బీ సిఅధ్యక్షుడు ,రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, అఫ్సర్ పాష, వెంకటాద్రి రెడ్డి,గద్వాల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శివ రెడ్డి, అలంపూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ ,స్నిగ్ధ రెడ్డి పాల్గొన్నారు.
Read More :