- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రశ్నాపత్రాల లీకేజీలో బీజేపీ నేతల ప్రమేయం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, మహబూబ్ నగర్: ఇటీవల లీక్ చేసిన పదవ తరగతి హిందీ ప్రశ్నాపత్రాల లీకేజీలో బీజేపీ నేతల ప్రమేయం ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బాబు జగ్జీవన్ రాం 116 వ జయంతి సంధర్భంగా బుధవారం స్థానిక తెలంగాణ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మంత్రి మీడియాతో మాట్లాడారు. తమ రాజకీయ అవసరాల కోసం టీఎస్పీఎస్ ప్రశ్నాపత్రాలను, తరువాత పదవ తరగతి పేపర్లను లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడం, వారిని భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
హిందీ పేపర్ లీక్ చేసిన బీజేపీ నాయకుడు వెంటనే ఆ పార్టీ అధ్యక్షుడికి పేపర్ ను పంపించడం, వెనువెంటనే మీడియాకు సమాచారం అందించడం వారి కుట్రలోని భాగమేనని ఆయన ఆరోపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సమాచారం అందించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కుట్రలో ఎవరు ఉన్నా, ఎంతటి వారైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని మంత్రి తెలిపారు. ఇలాంటి కుట్రలు ఆపి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని ఆయన హితవు పలికారు.