సీఎం సొంతూరులో..కన్నుల పండువగా విగ్రహ ప్రతిష్ఠ

by Naveena |
సీఎం సొంతూరులో..కన్నుల పండువగా విగ్రహ ప్రతిష్ఠ
X

దిశ, వంగూర్ : మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ , జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ లు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కు వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామంలో వారి స్వంత నిధులతో అత్యంత అద్భుతంగా పున్నర్ నిర్మించి.. నేడు నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నిధులు రూ.3 కోట్లతో పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారనీ, గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహం, ద్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమాలను మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే ఆలయ గర్భగుడిలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణలతో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా కనుల పండుగగా నిర్వహించారు అని తెలిపారు. ఈ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సోదరుడు కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

Advertisement

Next Story

Most Viewed