- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవరకద్రలో హైడ్రా ?
దిశ, దేవరకద్ర : దేవరకద్రలో ఆక్రమణలకు గురవుతున్న సర్వే నంబర్ 542, 543, 545లోని కాకతీయుల కాలంనాటి మల్లెల పాపయ్య కుంటను శుక్రవారం దేవరకద్ర తహసీల్దార్ కృష్ణయ్యతో పాటు మహబూబ్ నగర్ ఆర్డీఓ నవీన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ నవీన్ మాట్లాడుతూ మల్లెల పాపయ్య కుంట ఆక్రమణకు గురవుతుందని, దాదాపు ఈ కుంట కింద 300 ఎకరాలు సాగవుతుందని తెలిపారు. కానీ ఈ కుంటను కొంతమంది ఆక్రమిస్తున్నారని ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం చేపట్టిన హైడ్రా నేపథ్యంలో ఆయకట్టు దారుల ఫిర్యాదు మేరకు శుక్రవారం కుంటను అధికారులతో కలిసి సందర్శించినట్లు తెలిపారు. ఈ కుంట విస్తీర్ణం ఎంత ఉందో చూసి హద్దులు నిర్ణయించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కుంటలో ఏవైనా ఆక్రమణలు, నిర్మాణాలు ఉంటే చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌకుంట్ల మండల తహసీల్దార్ ఎల్లయ్య, ఆర్ఐ శరత్, ఇరిగేషన్ డీఈ చందు, రైతులు కొండాపురం అశోక్ , వీరన్న తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Hydra