- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య ఆత్మహత్య కేసులో భర్తకు రెండేళ్ల జైలు శిక్ష..
దిశ, మిడ్జిల్: భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో భర్తకు రెండేళ్ల జైలు శిక్ష, రూ. 1000 ల జరిమాన విధిస్తున్నట్లు జిల్లా అదనపు సెషన్స్ కోర్టు జడ్జి పద్మవతి తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. మిడ్జిల్ మండల పరిధిలోని కంచనపల్లి పల్లి గ్రామానికి చెందిన మల్లెపోగు రాములమ్మ (35), 01 అక్టోబర్ 2018 న తన ఇంటి వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో బాధితురాలుని 108 సాయంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ 03 అక్టోబర్ 2018 న జిల్లా ఆస్పత్రిలో మృతి చెందింది.
భార్య ఆత్మహత్య కేసులో భర్తకు రెండేళ్ల జైలు శిక్ష..ఈ ఘటనపై మృతురాలి భర్త సీనయ్య (40) ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ రవి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే పిల్లలు పుట్టకపోవడంతో తరచుగా భర్త సీనయ్య భార్య రాములమ్మతో గొడవ పడుతూ కొట్టేవాడని, మానసికంగా, శారీరకంగా హింసించడంతోనే రాములమ్మ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలడంతో, సాక్షాధారాలతో జిల్లా కోర్టులో ప్రవేశపెట్టడంతో జిల్లా అదనపు సెషన్స్ జిల్లా కోర్టు జడ్జి పద్మవతి భార్య ఆత్మహత్య చేసుకొని మృతి చెందడానికి కారణమైన భర్త సీనయ్యకు రెండేళ్ల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా విధించినట్లు మిడ్జిల్ ఎస్సై రాం లాల్ నాయక్ తెలిపారు.