- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఊట్కూర్ మండలం దంచికొట్టిన భారీ వర్షం.. ఉప్పొంగిన పెద్ద వాగు
దిశ, ఊట్కూర్: ఊట్కూర్ మండలంతో పాటు కర్ణాటకలోని ఎగువ ప్రాంతలలోని మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము కురిసిన భారీ వర్షాలకు పెద్దవాగు, చిన్న వాగుతో పాటు ఆయా గ్రామాల చెరువులు నీటి ప్రవాహంతో కళకళలాడుతున్నాయి.కర్ణాటక తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని శంకర్ లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మక్తల్ నియోజకవర్గంలోని సంగంబండ రిజర్వాయర్ కు పెద్ద ఎత్తున భారీగా వర్షపు నీరు పోటెత్తుతోంది. నీరు భారీగా పోటెత్తడంతో వాగు పరివాహక ప్రాంతంలోని మోటర్లు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో ప్రక్కన తెల్లవారుజామున వరకు వర్షం కురిసినందున పెద్ద వాగులో నీరు పెరిగే అవకాశం ఉందని వాగు పరివాహక ప్రాంత రైతులు అంటున్నారు.
మూడు సంవత్సరాల తర్వాత ఇంత పెద్దవాగుకు భారీగా నీరు వచ్చిందని, ఇక్కడి ప్రాంత ప్రజలు తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాలలోని రోడ్లు చిత్తుచిత్తుగా మారడంతో పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఎడవెల్లి, సమిస్తాపూర్, వల్లంపల్లి, యార్గట్ పల్లి, గ్రామాల బీటీ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర పాట్లు పడ్డారు. పొలాల్లో పెద్ద ఎత్తున నీరు నిలువ ఉండటంతో తమ పంటలకు రోగాలు వచ్చే అవకాశం ఉందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దోమల బెడదతో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు గ్రామాలలో పలు కాలనీలలో వర్షపు నీరు చేరి మరింత ఘోర స్థితికి గా మార్చింది. బుధవారం తెల్లవారుజామున వరకు భారీ వర్షం కురవడంతో వాగులలో చెరువులో నీరు మరింత చేరే అవకాశం ఉండటంతో అధికారులు సైతం చెరువులు, వాగుల దగ్గరికి వెళ్ళవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు.