- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ లక్ష్యం
దిశ, అచ్చంపేట : జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలోని సాయి నగర్ కాలనీలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో శనివారం విద్యార్థుల తాగునీటి మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఇన్చార్జి ఎంఈఓ జీవన్ కుమార్ పుష్పగుచ్చం ఇచ్చి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల వసతులను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థులకు ఎటువంటి తాగునీటి సమస్యలు లేకుండా మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించమన్నారు. అనంతరం పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్నిని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసి, వేతనాలు పెంచాలని ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేశారు. వారి ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించినందుకు తమ వంతు కృషి ఉంటుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కంకణ బద్ధులై సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.