ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో దిశ పత్రిక దిట్ట..

by Naveena |
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో దిశ పత్రిక దిట్ట..
X

దిశ,తాడ్వాయి : ప్రజా సమస్యలపై ఎప్పటి వార్తలు అప్పుడే ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధుల దృష్టికి చేరవేయడంలో దిశ దినపత్రిక ముందు వరుసలో ఉంటుందని తాడ్వాయి ఎమ్మార్వో రహీముద్దీన్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో దిశ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఖచ్చితమైన వార్తలను ప్రచురిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా దిశ దినపత్రిక మంచి గుర్తింపు తెచ్చుకుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ ఆలి, వ్యవసాయ అధికారి నర్సింలు,ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ ప్రశాంత్,ఇరిగేషన్ అధికారి మధు,ఆరోగ్య విస్తరణ అధికారి నారాయణ,ఐసిడిఎస్ సూపర్వైజర్ శివలక్ష్మి,దిశ రిపోర్టర్ నరేష్,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story