పెట్రోల్ బంక్‌లో ఘరానా మోసం.. లీటర్ పెట్రోల్ అడిగితే అర లీటర్ పెట్రోల్ పోసిన వైనం

by Aamani |
పెట్రోల్ బంక్‌లో ఘరానా మోసం.. లీటర్ పెట్రోల్ అడిగితే అర లీటర్ పెట్రోల్ పోసిన వైనం
X

దిశ, జడ్చర్ల : పెట్రోల్ బంక్ లో ఘరానా మోసానికి తెరలేపారు బంకు నిర్వాహకులు లీటర్ పెట్రోల్ కు బదులుగా అర లీటర్ పెట్రోల్ పోస్తూ వినియోగదారులను నిలువెత్తున ముంచుతున్నారు. ఈ ఘటన అక్రమ సంపాదనకు తెరలేపిన వైనం జడ్చర్ల పట్టణంలో ఇంద్ర నగర్ కాలనీ శ్రీనివాస థియేటర్ సమీపంలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల మండల పరిధిలోని గోపుల్లాపూర్ గ్రామానికి చెందిన అంజి అనే యువకుడు మార్గ మధ్యలో తన ద్విచక్ర వాహనం ఆగిపోవడంతో సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వెళ్లి లీటర్ బాటిల్ లో లీటర్ పెట్రోల్ పోయాల్సిందిగా డబ్బులు చెల్లించాడు. దీంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులు సిబ్బంది లీటర్ పెట్రోల్ కు మీటర్ ఫీడింగ్ చేయగా అందులో అర లీటర్ మాత్రమే పెట్రోల్ రావడానికి గమనించి వినియోగదారుడైన అంజి కంగుతిన్నాడు. ఇదేందని నిలదీస్తే ముందుగా నువ్వు అర లీటర్ కి డబ్బులు ఇచ్చావని బుకాయించారు.

ఆ తర్వాత 100 రూపాయల పెట్రోల్ పోశామని బంక్ సిబ్బంది వినియోగదారుడైన అంజి పై ఎదురుదాడికి దిగారు. దీంతో అంజి బంక్ సిబ్బంది తో వాదన పెట్టుకున్నాడు. అదే సమయంలో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన వినియోగదారులు అంజికి మద్దతుగా నిలిచారు. దీంతో పెట్రోల్ బంకు నిర్వాహకులు బంకులో కరెంటు పోయి రావడంతో ఆన్లైన్ లో పొరపాటు జరిగిందని తప్పును ఒప్పుకున్నారు. దీంతో వినియోగదారులు లీటర్ బాటిల్ లో పెట్రోల్ పోసుకున్నందుకు వీరి బండారం బయటపడిందని ఇలా ఇదివరకు ఎంత మందిని మోసం చేశారని, లీటర్ బాటిల్ లో పెట్రోల్ పోసుకోకుండా ఉండుంటే అందరికీ అదే విధంగా పెట్రోల్ పోస్తూ మోసం చేసేవారు కదా అని వినియోగదారులు ముకుమ్మడిగా బంక్ నిర్వాహకులను నిలదీశారు. అర లీటర్ పెట్రోల్ పోసిందే కాకుండా, నిలదీసిన వినియోదారుల పట్ల బంక్ సిబ్బంది ఎదురు మాట్లాడటం ఏందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయినా బంకు నిర్వాహకులను నమ్మే పరిస్థితి లేకపోవడంతో వాహనదారులు అందరూ లీటర్ బాటిల్ లో పెట్రోల్ పోయించుకొని వెళ్లారు. బంకులో యదేచ్చగా మోసం జరుగుతున్న ఎల్లవేళలా ప్రేయసించాల్సిన విజిలెన్స్ సివిల్ సప్లై అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది ఇప్పటికైనా మోసానికి పాల్పడిన పెట్రోల్ బంక్ ను సంబంధిత అధికారులు సందర్శించి గత వారం రోజుల నుండి వారి బంకులో వినియోగదారులకు పోసిన పెట్రోల్ ఆన్లైన్ డేటను పరిశీలించాలని మోసానికి పాల్పడిన బంకును సీజ్ చేయాలని వినియోగదారులు పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed