గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో... మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

by Kalyani |   ( Updated:2023-09-01 10:23:56.0  )
గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో... మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు
X

దిశ కోడేరు : కొడేర్ మండలం ఏత్తం గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.గ్రామంలోని ప్రతి గడపకు తిరుగుతూ ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు.అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.

రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫి,నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్,500 రూపాయలకే ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్,అర్హులైన వారికి 4000 రూపాయల పెన్షన్, పేద వారి ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల వరకు ఆర్థిక సహాయం,అంబేద్కర్ అభయ హస్తం కింద ప్రతి SC,ST కుటుంబానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అంటూ వివరించారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం నేడు అప్పులపాలైంది అని,తెలంగాణ సంపాదన అంత కాంట్రాక్ట్ ల పేరుతో దోచుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే లు గా గెలిచి కేసీఆర్ కి అమ్ముడుపోయిన వాళ్ళను గ్రామాల్లోకి రానివ్వకుండా తరిమేయలని జూపల్లి ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఏత్తం గ్రామ ప్రజలు బీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ ముద్దు అంటూ, ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా తమ వంతుగా కృషి చేసి,కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ నీ అత్యధిక మెజారిటీ తో గెలిపిస్తామని గ్రామ ప్రజలు జూపల్లి తో అన్నారు.గ్రామ ప్రజల తరపున సమస్యలపై కొట్లాడిన గ్రామ ఎంపీటీసీ శ్రీనివాస్ రావు పై అక్రమ కేసు లు పెట్టి, జైల్ కి పంపి పైశాచిక ఆనందం పొందుతున్నారని, కాంగ్రెస్ పార్టీని గెలిపించి, కొల్లాపూర్ నియోజక వర్గంలో ప్రజా ప్రతినిధులపై జరుగుతున్న ఇలాంటి అరాచక పాలనకు చరమగీతం పాడాలని జూపల్లి ప్రజలకు పిలుపిచ్చారు.

ఈ కార్యక్రమంలో కొడేర్ మండల మాజీ ఎంపీపీ, జడ్పీటీసీలు, కొత్త రామ్మోహన్రావు ఏత్తం గ్రామ సర్పంచ్ ,గ్రామ ఎంపీటీసీ, కొడేర్ మండల, ఏత్తం గ్రామ ఇతర ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు,పార్టీలోని అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీమతి శైలజా విష్ణువర్ధన్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు గోపిశెట్టి శివ, మాజీ కౌన్సిలర్ ఉస్సేన్, నిజాం, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed