డబుల్ దగా తేలదా.. విచారణ చేసినా బయటపెట్టని వైనం

by Anjali |
డబుల్ దగా తేలదా.. విచారణ చేసినా బయటపెట్టని వైనం
X

దిశ, మహబూబ్‌నగర్: గత పది రోజుల నుంచి మహబూబ్ నగర్ నియోజకవర్గం అంతా కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అక్రమ వ్యవహారమే ప్రధాన చర్చగా సాగుతోంది. ఈ వ్యవహారంలో రూ.కోట్లు చేతులు మా రినట్లు జిల్లాకేంద్రంలో వార్తలు వినిపిస్తున్నాయి. అయి తే ఈ వ్యవహారంపై భాధితులు గతంలో ఫిర్యాదు చేసి నా ఏవ్వరూ పట్టించుకోలేదు. కానీ, ప్రస్తుతం ఫిర్యాదు చేసినా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నరే తప్ప అవీనితి ఆదికారులపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునేందుకు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఈ అక్రమార్కులకు ఒకరిద్దరూ జిల్లా ప్రజాప్రతినిధులు వెన్నుదన్నుగా నిలుస్తున్నందుకే ఉన్నతాధికారులు చర్యలకు వెనకడుగు వేస్తున్నట్లు ఆధికారిక వర్గాల్లో టాక్ నడుస్తోంది.

అవినీతి అధికారులపై చర్యలకు వెనకడుగు

గత అర్బన్ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది డబుల్ బెడ్ రూం అక్రమ వ్యవహారాలకు సంభంధించి ఉన్నత ఆధికారులకు పూర్తి ఆధారాలతో భాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఆధారాలతో పూర్తిస్థాయిలో ఆధికారుల సైతం విచారణ సాగించారు. కానీ చర్యలు తీసుకోవాలంటే మా త్రం ఉన్నతాధికారులు సైతం భయపడాల్సిన పరిస్థితి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు ఈ అవినీతి అధికారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఓ దశలో కఠిన చర్యల ఉపక్రమించే క్రమంలో పైస్థాయిలో కట్టడి వేస్తున్నారనే వార్తలు మహబూబ్ నగర్ పరిధిలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న గత అర్బన్ కార్యాలయ సిబ్బంది ఇప్పుడు కూడా మహబూబ్‌నగర్ కార్యాలయ రికార్డ్ లకు సంబంధించి తప్పులను సరిచేసే క్రమంలో సం తకాలు చేసి పంపిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

తహసీల్దార్, ముగ్గురు ఆర్ఐలు గత ప్రభుత్వ హయాంలో మెుత్తం అర్బన్ తహసీల్దార్ కేంద్రంగా ముగ్గురు ఆర్ఐలు, ఓ తహసీల్దార్ ఆడిందే ఆట పాడిందే పాట అన్నచందంగా పరిస్థితి ఉండేది. తాము చేసిన ఏ వ్యవహారానికి అయినా ఎలాంటి ప్రోసిడింగ్ కాఫీలు లేకుండా పని కానిచ్చేశారు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది అంతా తలలు పట్టుకుంటున్నారు. పలు డబుల్ బెడ్ రూంల వ్యవహారంలో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం ఇవ్వాలని కోరడంతో తమ కార్యలయంలో పూర్తి స్థాయి సమాచారం లేకపోవడంతో సతమతం అవుతున్నారు.

ఖాళీ స్థలాలకు డబుల్ బెడ్ రూం పట్టాలు

డబుల్ బెడ్ రూంల వ్యవహారంలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఒక అడుగు ముందుకేసి ఖాళీ స్థలాలకు డబుల్ బెడ్ రూం పట్టాలు ఇచ్చేశారు. మహబూబ్ నగర్ శివారులోని ఏనుగొండలో సర్వే నెంబర్ 25కు సంభంధించి మెుత్తంగా 85డబుల్ బెడ్ రూం పట్టాలను ఇప్పటికే లబ్ధిదారులు ఇచ్చేశారు. ఈ సర్వే 25లో సమాచార హక్కు చట్టం ద్వారా హౌసింగ్ కార్పొరేషన్ ఆదికారులను డబుల్ బెడ్ నిర్మాణాలకు సంబం దచిన సమాచారం కోరగా కేవలం సర్వే నెంబర్ 25లో 19ఇండ్లు మాత్రమే పూర్తయినట్లు సమాచారం ఇచ్చారు. ఇలా నిర్మాణం అయిన 19ఇండ్లుకు 85పట్టాలు ఎలా ఇచ్చారని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed