మరోసారి సోమశిల ఆలయానికి పోటెత్తిన భక్తులు

by Mahesh |
మరోసారి సోమశిల ఆలయానికి పోటెత్తిన భక్తులు
X

దిశ, కొల్లాపూర్: కార్తీక మాసం బహుళ అమావాస్య సందర్భంగా సోమశిల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. సోమశిలలోని జనరల్ పుష్కర ఘాట్, విఐపి పుష్కర ఘాట్ భక్తులతో సందడిగా కనిపించాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. సప్త నదుల సంగమ ప్రదేశం కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. సోమశిలలోని లలిత సోమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు రుద్రాభిషేకం, పుష్పార్చన, కుంకుమార్చన, మంగళ హారతి వంటి విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తీసుకొచ్చిన టూరిస్టు వాహనాలు పుష్కర జనరల్ ఘాట్, ఆలయ ప్రాంగణంలోనూ కిక్కిరిసిపోయాయి. కార్తీక మాసం ముగింపు సందర్భంగా..భారీ ఎత్తున తరలి రావడం ఇదే ప్రథమం. ఇదిలా ఉండగా సోమేశ్వర ఆలయం ప్రాంగణంలో వివిధ వర్గాలకు చెందిన వారు వనభోజనం కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed