- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుస్థిర పాలన, సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యం – ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
దిశ, అచ్చంపేట : సుస్థిర పాలన, సుస్థిర ప్రభుత్వం ఉంటేనే రాష్ట్ర, దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని, అలాంటి నాయకులు, ప్రభుత్వాలే ప్రజల సంక్షేమం ఆర్థిక అభివృద్ధి స్వావలంబన విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా 400 అంగన్వాడీ కేంద్రాలకు 4 కుర్చీలు ఒక టేబుల్ చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాలలో గర్భిణీలకు తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం ఇతర సౌకర్యాలను కల్పిస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ టీచర్లు, సిబ్బందికి జీతభత్యాలు సీఎం కేసీఆర్ పెంచారని, వారి బాగోగులను పట్టించుకున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ, పదర రాంబాబు నాయక్, సిడిపిఓ దమయంతి, లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.