నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రమాదకర కోనో కార్పస్ చెట్లు

by Mahesh |
నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రమాదకర కోనో కార్పస్ చెట్లు
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: ప్రభుత్వం కోనో కార్పస్ మొక్కలను నర్సరీలో పెంచొద్దని.. అలాగే ఆకర్షణ కోసం ఈ చెట్లను ఎక్కడా కూడా పెంచవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా నారాయణపేట జిల్లా కేంద్రంలో కోనో కార్పస్ ను ప్రధాన రహదారిలో పెంచారు. ఈ చెట్ల వల్ల పర్యావరణ ఇబ్బందులతో పాటు..ఆరోగ్య ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. సుమారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ చెట్ల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని జిల్లా కేంద్రం ప్రజలు వాహన చోదకులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ప్రజారోగ్యం దృష్ట్యా కోనో కార్పస్ చెట్లను తొలగించారు. ఈ చెట్ల నుంచి వచ్చే గాలి అలాగే ఈ చెట్ల నుంచి వచ్చే పుప్పొడి వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయనేది బహిరంగ సత్యం. అయినప్పటికీ చెట్లను అలాగే వదిలి వేయడం తో ముప్పు పొంచి ఉంది. అధికారులు స్పందించి నారాయణపేట జిల్లా కేంద్రం మెయిన్ రోడ్ మీడియంలో ఏర్పాటు చేసిన కోనో కార్పస్ చెట్లను తొలగించి..జిల్లాలో ఈ చెట్ల వినియోగాన్ని నిషేధించాలని పర్యావరణ ప్రేమికులు ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed