- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి హేయమైన చర్య
by Naveena |
X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ దాడి హేయమైన చర్య అని,బాధ్యులను ఎవ్వరినీ వదిలేది లేదని పార్లమెంటు సభ్యురాలు డికె అరుణ ఒక ప్రకటనలో హెచ్చరించారు.ఇలాంటి గుండా రాజకీయాలు ఇకపై సాగవని,చిల్లర రాజకీయాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఖబర్ధార్ మిస్టర్ రేవంత్ రెడ్డి అని ఆమె తీవ్రంగా హెచ్చరించారు.ఇలాంటి దాడులకు భయపడేదిలేదని,మాకు ఓర్పు,శాంతం,సహనం నశిస్తే ఎలా ఉంటుందో కూడా చూపిస్తామని ఆమె పేర్కొన్నారు. పార్టీ ఆఫీస్ పై పోలీసుల సమక్షంలో దాడులు జరిగాయంటే,ఈ ఘటన వెనుక సీఎం రేవంత్ రెడ్డి కుట్ర దాగుందని ఆరోపిస్తూ,ఇందుకు ఆయన బాధ్యత వహించాలన్నారు. దాడిలో పాల్గొన్న వారినెవ్వరినీ వదలకుండా వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Advertisement
Next Story