- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హమ్మయ్య పాప దొరికింది...!
by Sridhar Babu |
X
దిశ, వేములవాడ : వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చి డిసెంబర్ 23న ఆలయ ప్రాంగణంలో తప్పిపోయిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సింగారపు అద్విత (4) ఆచూకీ లభ్యమైనట్లు ప్రాథమిక సమాచారం. మహబూబాబాద్ జిల్లాలోని ఓ ప్రాంతంలో బుధవారం సాయంత్రం పోలీసులు పాపను గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై గురువారం మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్టు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఇదిలా ఉండగా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలిక మిస్సింగ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక బృందాలతో పాపను గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో చాలా రోజుల నిరీక్షణ తర్వాత పాపను మహబూబాబాద్ లో గుర్తించినట్లు తెలిసింది. దీంతో పోలీసుల శ్రమ ఫలించినట్లయింది.
Advertisement
Next Story