- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ చెక్కుల పై రెండు తేదీలు..
దిశ, అలంపూర్ : కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు సంబంధించిన చెక్కుల పై ఒకే సారి రెండు తేదీలు ఉండడంతో... ఆ చెక్కులు చెల్లవని బ్యాంకు యాజమాన్యం చెప్పడంతో లబ్ధిదారుల్లో రెండు గంటల పాటు టెన్షన్ నెలకొంది. బుధవారం మానవపాడు మండల కేంద్రంలోని మండల పరిషత్ లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే విజయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. 75 చెక్కులను లబ్ధిదారుల కుటుంబాలకు నేరుగా ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, మండల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెక్కులు తీసుకున్న వెంటనే స్థానిక ఎస్బీఐ బ్యాంకుకు లబ్ధిదారులు చేరుకొని వారికి అందించిన చెక్కులను బ్యాంకు మేనేజర్ కు చూపించారు.
చెక్కుల పై రెండు తేదీలు ఉండడంతో ఓపెన్ కావడం లేదని.. ఈ చెక్కులు చెల్లవని ఒక్కసారిగా మేనేజర్ చెప్పడంతో లబ్ధిదారులు అవ్వక్కయ్యారు. హుటాహుటిన ఇట్టి కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే విజేయుడును కలవాలని లబ్ధిదారులందరూ మండల పరిషత్ కు చేరుకున్నారు. అప్పటికే ఎమ్మెల్యే అటు నుంచి వెళ్లిపోవడంతో, తహశీల్దార్ వహీదా ఖాతున్ కలిసి తమ గోడును చెప్పుకున్నారు. చెల్లని చెక్కులు ఇచ్చారని, అలాంటి చెక్కులు లబ్ధిదారులకు ఇస్తే ఎలా అని.. కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం సరికాదని లబ్ధిదారులు కాసేపు తహశీల్దార్ తో వాదనకు దిగారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకుడు డీసీసీ జిల్లా కార్యదర్శి సిరాజ్ తహశీల్దార్ కార్యాలయం చేరుకుని అక్కడున్న బాధితులతో మాట్లాడారు. జరిగిన విషయం తెలుసుకొని ఆర్డీవోకు చెక్కుల విషయం తెలిపి.. రెండు తేదీలు ఉంటే ఇలాంటి ఇబ్బంది లేదని.. బ్యాంకులో అవి చెల్లుబాటు అవుతాయని రేపు బ్యాంకుకు వెళ్లి మీ చెక్కులను వేసుకోవచ్చని ఆర్డీఓ, తహశీల్దార్ తెలిపారని సిరాజ్ చెప్పడంతో లబ్ధిదారులు శాంతించి వెళ్లారు.