‘మనఊరు మనబడి’ పనులు త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

by Kalyani |
‘మనఊరు మనబడి’ పనులు త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
X

దిశ, కోస్గి: కోస్గి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను శనివారం నారాయణపేట జిల్లా కలెక్టర్ పరిశీలించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న పనులలో డైనింగ్ హాల్ , మరుగు దొడ్ల నిర్మాణం పనులను పున: ప్రారంభోత్సవం కంటే ముందే పూర్తి చేయాలన్నారు. అలాగే కోస్గిలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను పర్యవేక్షించి త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు.

మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి లో పాల్గొన్న కలెక్టర్ ప్రజల ద్వారా తహసీల్దార్ చాంబర్ లో తానే స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం అయ్యేందుకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మమత, స్వాతి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story