- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుగొండ పునరావాస కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
దిశ, మక్తల్: మక్తల్ నియోజకవర్గంలోని అనుగొండ గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా ప్రకటించడంతో ఇప్పటివరకు జరిగిన పనుల పరిశీలన నిమిత్తం గురువారం కలెక్టర్ కోయ శ్రీహర్ష గ్రామాన్ని సందర్శించారు. జూరాల బ్యాక్ వాటర్ లో అనుగొండ గ్రామంలో ముంపునకు గురైనప్పుడు 613 కుటుంబాలు నివసిస్తుండగా ఇరవై సంవత్సరాల్లో వంద కుటుంబాలు పెరిగాయి. వారికి కూడా న్యాయం జరిగేలా చూడాలని గ్రామ సర్పంచ్ గడ్డం రమేష్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. ఇది ఇలా ఉండగా అనుగొండ గ్రామానికి పునరావాసం కల్పించేందుకు అనువైన భూమిని 2015లో 250, 251, 252, 253, 68, 254, 232 సర్వే నెంబర్లలో 80 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది.
అందుకుగాను బాధితులకు నష్టపరిహారం చెల్లించింది. అది చాలదని బాధితులు కోర్టుకు వెళ్లడంతో రెండో విడత నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాంచందర్, ఎంపీడీఓ శ్రీధర్, ఎంపీవో పావని, ఈఈ సంజీవ్ ప్రసాద్, డీటీ రవీందర్ రెడ్డి, సర్వేయర్ బండారి క్రిష్ణ, అనుగొండ సర్పంచ్ గడ్డం రమేష్, ఎంపీటీసీ పద్మ రాములు, ఉప సర్పంచ్ కొండప్ప తదితరులు పాల్గొన్నారు.