ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్

by Kalyani |
ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్
X

దిశ, నారాయణపేట ప్రతినిధి ( దామరగిద్ద ): పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం దామరగిద్ద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడుతూ… వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు జరిగేలా ఏఎన్ఎమ్ లు, ఆశా కార్యకర్తలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి అవసరం అయ్యే మందులు, తదితర వాటిపై చర్చించారు. కాగ ఆసుపత్రికి ఆలస్యంగా వచ్చిన వైద్యురాలికి కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు.

Next Story

Most Viewed