కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదు – EX MLA Erra Shekhar

by Kalyani |   ( Updated:2023-08-20 16:21:22.0  )
కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదు – EX MLA Erra Shekhar
X

దిశ, జడ్చర్ల : గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిరుద్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచ్ అనుచరులు దాడులు చేసి గాయపరచడాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తీవ్రంగా ఖండించారు.జడ్చర్ల బీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడం సరైన విధానం కాదు అన్నారు.

ఈ ఘటనలో పలువురికి గాయాలు కావడంతో జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని కాంగ్రెస్ కార్యకర్తలను ఎర్ర శేఖర్ పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహనం కోల్పోయారని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అనుకుంటే దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలు, కబ్జాలను, ప్రశ్నిస్తే స్ధానిక ఎమ్మెల్యే అనుచరులు కొట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ దాడులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒబేదుల్ల కొత్వాల్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ , తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story