అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్ లారీ పట్టివేత..

by Kalyani |   ( Updated:2023-03-30 13:34:41.0  )
అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్ లారీ పట్టివేత..
X

దిశ, జడ్చర్ల: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పశువులను తరలిస్తున్న భారీ కంటైనర్ లారీని గురువారం జడ్చర్ల పోలీసులు పట్టుకున్నారు. జడ్చర్ల పట్టణ సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల మండల పరిధిలోని బూరెడ్డిపల్లి సమీపంలో గురువారం వాహనాలు తనిఖీలు చేస్తుండగా, కర్నూల్ వైపు వెళ్తున్న భారీ కంటైనర్ పై అనుమానం వచ్చి కంటైనర్ తెరిచి చూడగా అందులో 32 ఎద్దులను ఒకే వాహనంలో కుక్కి పశువులను హింసిస్తూ తరలిస్తున్న విషయాన్ని గమనించి లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు.

కంటైనర్ వాహనాన్ని జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. 32 ఎద్దులను ఎలాంటి అనుమతులు, పత్రాలు లేకుండా అక్రమంగా అదిలాబాద్ నుంచి పెబ్బేరుకు తరలించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిసింది. కాగా పశువుల కండిషన్ పై వెటర్నరీ ఏడీ వెటర్నరీ డాక్టర్ చే పరీక్షలు నిర్వహించి పశువుల హన్వాడ మండలం చిన్నదర్పల్లి లోని గోశాలకు పశువులను తరలించి, లారీ డ్రైవర్ షానిమాన్ పై కేసు నమోదు చేశారు. వాహనాల తనిఖీలలో ఎస్ఐలు లెనిన్ గౌడ్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story