- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో వ్యక్తి అరెస్టు..
దిశ, జడ్చర్ల/నవాపేట: టీఎస్ పీఎస్సీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మరో వ్యక్తిని శనివారం తెల్లవారుజామున సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని హైదరాబాదుకు తరలించారు. పేపర్ల లీకేజీ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే.. గండీడ్ మండలానికి చెందిన ప్రధాన నిందితులు రేణుక, ఆమె భర్త భార్య నాయక్ కలిపి మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అయిన రాజశేఖర్ రెడ్డి, ఇతర నిందితులను విచారించడం.. వారి నుండి పేపర్లను ఎవరెవరు కొనుగోలు చేశారు అన్న విషయాన్ని ఆరా తీయడంతో నవాపేట మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఈజీఎస్ ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగి ప్రశాంత్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది.
సిట్ అధికారులు శుక్రవారం జిల్లాకు చేరుకొని ప్రశాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని నవాపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి రాత్రి 7:30 గంటల నుండి శనివారం తెల్లవారుజామున మూడు గంటల వరకు విచారణ జరిపారు. ఇంజనీరింగ్ ఏఈ పరీక్షలకు సంబంధించి నిర్వహించిన ప్రశ్నాపత్రాల కొనుగోలుకు గాను ఏడున్నర లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని.. ప్రశ్నాపత్రాలను ముందుగానే తీసుకున్నట్లు నిందితుడు ప్రశాంత్ రెడ్డి సిట్ అధికారుల ముందు అంగీకరించినట్లు సమాచారం.
తనతోపాటు నవాపేట మండలానికి చెందిన మరో ఇద్దరు యువకులు, షాద్ నగర్‌కు చెందిన మరో యువకుడు ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసినట్లు ప్రశాంత్ రెడ్డి వెల్లడించినట్లు సమాచారం. నలుగురు కలిసి మొత్తం 30 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రశాంత్ రెడ్డి సిట్ అధికారులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరింత మంది పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరిన్ని వివరాలు సేకరించినందుకు శనివారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో ప్రశాంత్ రెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్‌కు తరలించారు.