అందరూ భక్తి భావంతో కొలువాలి

by Naveena |
అందరూ భక్తి భావంతో కొలువాలి
X

దిశ,పెద్ద కొత్తపల్లి: ప్రజలందరూ భక్తి భావంతో భగవంతుని కొలువాలని శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి ప్రజల పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో టీటీడీ ఆర్థిక సాయంతో కొత్తగా నిర్మాణం చేయనున్న శ్రీ కోదండ రామస్వామి ఆలయాల నిర్మాణం కార్యక్రమం భూపూజ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన బుధవారం దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ..ఎంతో పవిత్రమైన ధనుర్మాసంలో ప్రజలు భక్తి భావాన్ని పాటిస్తూ దేవుళ్ళను కోలువాలని పిలుపునిచ్చారు. వనపర్తి నుంచి వచ్చిన మనోజ్ శర్మ తన గానామృతంతో భక్తులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన ఆచార్యులు శేషాచార్యులు, ప్రణయ్ శర్మ కొత్తపల్లి శేఖర్, శేఖర్ శర్మ, తెలకపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story