పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య

by Naveena |
పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య
X

దిశ, ఊట్కూర్ : వివాహం కావడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. స్ధానిక గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు వివాహం కావడం లేదని కొద్ది రోజులుగా బాధపడుతున్నాడు. ఇదే క్రమంలో యువకుడు మద్యానికి బానిస అయ్యాడు. కుటుంబ సభ్యులు యువకుడి కు పెళ్లి చేద్దామని అమ్మాయిని చూసిన కుదరకపోవడంతో పాటు..ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో మనోవేదనకు గురైన ఆ యువకుడు సోమవారం తెల్లవారుజామున తన వ్యవసాయ భూమిలో ఉన్న చింత చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటా హుటిన సంఘటన స్థలానికి వెళ్లి చూడగా..చీరతో ఉరి వేసుకుని చనిపోయినట్టు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమచారం.

Advertisement

Next Story

Most Viewed