- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Director Nag Ashwin : సొంత ఊరి పై మమకారం చూపించిన డైరెక్టర్..
దిశ, నాగర్ కర్నూల్, తాడూర్ : జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా.. పుట్టిన ఊరు, కన్నతల్లిని ఎప్పటికీ మరచిపోకూడదని అంటారు పెద్దలు. కన్నతల్లితో సమానమైన సొంత గ్రామంతో అనుబంధం పేగు బంధం లాంటిది. అలాంటి సొంత ఊరి పాఠశాల గ్రామ అభివృద్ధికై ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని ఐతోల్ గ్రామంలో కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సొంత గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 66 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన 4 అదనపు తరగతి గదులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డిలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా జన్మనిచ్చిన గ్రామాన్ని, జీవితాన్నిచ్చిన పాఠశాలను ఏ ఒక్కరూ మర్చిపోకూడదని అన్నారు. అందుకు సహాయం చేసి అభివృద్ధి పరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉంటుందని తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.
పాఠశాలకు అవసరమైన మరుగుదొడ్లు మౌలిక వసతులను దాతల సహాయంతో పూర్తి చేస్తామని తెలిపారు. పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నత స్థానంలో రాణించేలా నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయుల కృషి చేయాలని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ చిన్న వయస్సులోనే కల్కి సినిమాతో ప్రపంచ స్థాయికి ఎదిగిన నాగ్ అశ్విన్ నాగర్ కర్నూల్ వాసి కావడం అందరికీ ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. ప్రపంచ స్థాయికి ఎదిగినా జన్మనిచ్చిన గ్రామాన్ని మర్చిపోకుండా పాఠశాలకు అవసరమైన అదనపు గదులను నిర్మించడం అభినందనీయమన్నారు. గ్రామ అభివృద్ధికి పాటుపడేలా కృషి చేస్తున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానంలో వివిధ హోదాల్లో ఉన్న వారందరూ ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.
అనంతరం కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ తల్లిదండ్రుల కోరిక మేరకు గ్రామ పాఠశాలలో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు తన వంతుగా సహాయ సహకారాలు అందించానని, గ్రామంలో గుడి బడిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. విద్యార్థులు ఉన్నత స్థానంలో రాణించేలా గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చేలా చదివి డైరెక్టర్లుగా, యాక్టర్లు, డాక్టర్లు, లాయర్లు కావాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
వచ్చే సంవత్సరం నాటికి పాఠశాలలోని అన్ని మౌలిక వసతులు కల్పించి ఆదర్శవంతమైన పాఠశాలను తీర్చిదిద్దుతానని నాగ్ అశ్విన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివించాలని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాగ్ అశ్విన్ తల్లి జయంత్ రెడ్డి, తండ్రి జయరామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఇందుమతి, కుటుంబ సభ్యులు కృష్ణారెడ్డి, రామ్ రెడ్డి, నరసింహారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.