- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రూరంతో కూడిన కామం.. లింగనిబిడ్డ-4 ట్రైలర్ విడుదల (వీడియో)
దిశ, హైదరాబాద్: మనచుట్టూ జరిగే సంఘటనలను కళ్లకు కట్టినట్టు చిత్రీకరించడంతోపాటు, ప్రజలకు ఓ సందేశాన్ని అందించేందుకు కృషిచేయాలని దిశ ఎడిటర్ మార్కండేయ సూచించారు. గురువారం ‘దిశ’ ప్రధాన కార్యాలయంలో Bhavya, Harshavardhan సమర్పణలో నిర్మించిన షార్ట్‌ఫిల్మ్ ‘లింగనిబిడ్డ-4’ ట్రైలర్ పోస్టర్‌ను మార్కండేయ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షార్ట్ ఫిలింలు వినూత్నంగా నిర్మించాలని సూచించారు. ఇలాంటి షార్ట్ ఫిల్మ్‌లు మరిన్ని తీసేందుకు ప్రయత్నాన్ని కొనసాగించాలన్నారు. లింగనిబిడ్డ -1, 2, 3 ఎమోషనల్ స్టోరీలలో మంచి కథతో తెరకెక్కించడంతోనే ప్రేక్షకులకు చేరువైందన్నారు.
ఎమోషనల్ స్టోరీని నిర్మించిన ‘హర్ష విలేజ్ షో’(Harsha Village Show)టీమ్ సభ్యులను ఆయన అభినందించారు. లింగని బిడ్డ-4 షార్ట్ ఫిల్మ్‌కు బాలు పాలోజి నిర్మాతగా వ్యవహరించగా, ప్రసాద్నంగునూరి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. అపూర్ సంతోష్ డీఓపీ, డీఐ, రమేశ్ పయ్యావుల అసిస్టెంట్ కెమెరా మెన్, దిల్ సే రుస్తుం ఎడిటింగ్, నటీనటులుగా రజినిమహేశ్, రాధాకిషన్, ప్రసాద్, సుమతి తదితరులు నటించారు. పోస్టరావిష్కరణలో దిశ బ్యూరో చీఫ్ విశ్వనాథ్, అసిస్టెంట్ ఎడిటర్ హరీశ్, నెట్ వర్క్ ఇన్‌చార్జి ప్రవీణ్, వెబ్ సైట్ ఇన్‌చార్జి నాగయ్య, యూట్యూబ్ ఇన్ చార్జ్ నాగలక్ష్మి, ఎడిట్ పేజీ ఇన్‌చార్జి రాజశేఖర్, దిశ అడ్మిన్ మేనేజర్ సురేశ్ శర్మ, టెక్నికల్ ఇన్‌చార్జి అనుకరణ్, చీఫ్ సబ్ ఎడిటర్ నిసార్, ఫీచర్ డెస్క్ సీనియర్ సబ్ ఎడిటర్ జావేద్, సీనియర్ డిజైనర్ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, మరోవైపు కరీంనగర్‌లో ఈ ట్రైలర్‌ను ప్రముఖ యూట్యూబర్, నట కిరీటి ఆర్ఎస్ నందా విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లింగనిబిడ్డ ట్రైలర్ సినిమా రేంజ్‌లో తీశారని ప్రశంసించారు. కథలో దమ్ముతో పాటు స్ర్కీన్ ప్లే అద్భుతంగా ఉందని కొనియాడారు. అక్కెన భాస్కర్ మాట్లాడుతూ.. డైరెక్షన్, ఎడిటింగ్, ఆర్టిస్ట్‌లు వారి వారి క్యారెక్టర్లలో జీవించారని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాధాకిషన్, ముమ్మాడీ బ్రహ్మచారి, గ్రాఫిక్ శ్రీను, నునుగొండ కిషన్, రంగారావు, దూలం తిరుపతి, సల్ల రమణకర్, రాజ్ ఉరగొండ, రాజి రెడ్డి, ప్రసాద్ పుదరి, పవన్, స్రవంతి, రూప, సుమతి, రమేష్ పయ్యావుల, దిల్ సే రుస్తుం, ప్రసాద్ నంగునూరి, అపుర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ట్రైలర్ లింక్: https://youtu.be/ShipSqKekO0?si=WQEbNRd3jPE32rvN