Council: మన్మోహన్ సింగ్‌కు సంతాపం మండలికి లేదా? సీఎంకి మధుసుదనాచారి బహిరంగ లేఖ

by Ramesh N |
Council: మన్మోహన్ సింగ్‌కు సంతాపం మండలికి లేదా? సీఎంకి మధుసుదనాచారి బహిరంగ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: శాసన మండలిపై చిన్న చూపు తగదని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసుదనాచారి పేర్కొన్నారు. ఇటీవల కన్నుమూసిన (Former Prime Minister Manmohan Singh) మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలిపే అవకాశాన్ని శాసనమండలికి కల్పించకపోవడంపై (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డికి ఆయన (S. Madhusudhana Chary) బహిరంగ లేఖ రాశారు. నిరాడంబరుడు, నిగర్వి, నిజాయితీపరుడు, నిష్కపటుడు, నిష్కళంకుడు, నిశిత పరిశీలకుడు, పరిశోధకులు అనేక హోదాల్లో భారతదేశానికి విశిష్ట సేవలు అందించి ఆర్థిక సంస్కరణలతో భారత ఆర్థిక ప్రగతి శిలను శిల్పంగా చెక్కి భారత జాతి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న భారత మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ గురించి స్మరించి గౌరవమైన సంతాపం తెలిపే అవకాశం శాసనమండలికి కలిగించక పోవడం బాధాకరం, విచారకరమని తెలిపారు.

దేశంలోని ఎగువ సభకు అనేక పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన మహానుభావుడికి రాష్ట్రంలోని ఎగువ సభలో సంతాపాన్ని తెలియజేయడం సముచితమన్నారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఏ మాత్రం కాదని, ఇది శాసన మండలి హృదయ వేదనగా పరిగణించాలని సూచించారు. రాష్ట్రంలోని ఎగువసభపై చిన్నచూపు, చులకన భావన తగదని, ఇకముందు పునరావృతం కాకుడదని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story