Lasya Nanditha : లాస్య నందిత మృతి.. KTR ఎమోషనల్ నోట్

by Sathputhe Rajesh |   ( Updated:2024-02-26 07:42:00.0  )
Lasya Nanditha : లాస్య నందిత మృతి.. KTR ఎమోషనల్ నోట్
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత (33) రోడ్డు ప్రమాదంలో శుక్రవారం కన్నుమూశారు. పటాన్ చెరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పడంతో యాక్సిడెంట్ అయింది. ఈ ఘటనలో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు.

ఇక, యువ MLA మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘వారం రోజుల క్రితమే లాస్యను కలిశాను. కాసేపటి క్రితమే లాస్య నందిత ఇక లేదనే షాకింగ్ న్యూస్ విన్నాను.!! యువ ఎమ్మెల్యే, మంచి భవిష్యత్తు ఉన్న నాయకురాలు చనిపోయారనే వార్త జీర్ణించుకోలేక పోతున్నాను. ఈ కష్ట కాలంలో వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు. కాగా ఇటీవల నల్లగొండ సభ సందర్భంగా లాస్య నందిత కారు ప్రమాదానికి గురయ్యారు. ఆ సందర్భంగా కేటీఆర్ ఆమెను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ ఫోటోలను లాస్య నందిత ట్విట్టర్ లో షేర్ చేసి ‘థాంక్స్ రామన్న’ అని కామెంట్ చేశారు.

Advertisement

Next Story