- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లాస్య నందిత యాక్సిడెంట్.. వాహనదారులకు పోలీసుల కీలక హెచ్చరిక
దిశ, డైనమిక్ బ్యూరో:ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. రోజుకో చోట ఏదో రూపంలో యాక్సిడెంట్లు జరుగుతుండటం ఈ ఘటనల్లో అనేక మంది మృత్యువాత పడుతుండటం వారి కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగుల్చుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కొన్ని మానవ తప్పితాలతో సంభవిస్తుంటే మరికొన్ని ఘటనలు ఇతర కారణల వల్ల జరుగుతున్నాయి. దీంతో అప్పటి వరకు అందరిలో కలిసి తిరిగిన వారంతా ఆయువు వదిలి అనంతలోకాలకు వెళ్తున్నారు. తాజాగా ఘోర రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృత్యువు ఒడికి చిక్కడం అందరిని కలిచివేస్తోంది. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే సీటు బెల్ట్ ధరించలేదని దీంతో ఆమె తలకు తీవ్రమైన గాయాలై స్పాట్ లోనే మృతి చెందినట్లు నందిత పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదికలో వైద్యులు వెల్లడించారు. తలకు బలమైన గాయాలు అయ్యాయని ప్రమాదం ధాటికి ఆమె శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఒక వేళ సీటు బెల్ట్ ధరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని రోడ్డు భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో తాజాగా ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న సూచన ఆసక్తిగా మారింది.
సీట్ బెల్ట్ ఆప్షన్ కాదు అలవాటు కావాలి:
ఈ క్రమంలో తాజాగా వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. సీటు బెల్ట్ ధరించడం అనేది ఆప్షనల్ కాకూడదని హెచ్చరించారు. కారులో అడుగుపెట్టిన ప్రతిసారి సీటు బెల్ట్ ధరించడం ఒక అలవాటుగా ఉండాలని సూచించారు.ఈ మేరకు శుక్రవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వాహనదారులకు సీటు బెల్ట్ పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
దడ పుట్టిస్తున్న గణాంకాలు:
రోడ్డు ప్రమాదాల విషయంలో అధికారులు విడుదల చేసిన గణాంకాలు చూస్తే ఒళ్లు జలదరించేలా ఉంటున్నాయి. తెలంగాణ పోలీసు శాఖ విడుల చేసిన క్రైమ్ ఇన్ తెలంగాణ రిపోర్ట్ ప్రకారం 2022లో రాష్ట్రంలో 21619 రోడ్డు ప్రమాదాల కేసును నమోదు కాగా 7,559 మంది మృత్యువాత పడ్డారు. మరో 20,209 మంది గాయాలపాలయినట్లు పేర్కొన్నారు. అయితే ఇవన్ని అధికారికంగా పోలీసుల లెక్కలోకి వచ్చిన వివరాలే కావడం లెక్కలోకి రాని యాక్సిడెంట్లు ఇకెన్నో అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.