- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'HIT:3' పై సాలిడ్ అప్‌డేట్.. కశ్మీర్ కష్టపడుతున్న అర్జున్ సర్కార్
దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Natural star Nani) ప్రజెంట్ 'HIT: The 3rd Case'తో బిజీగా ఉన్నాడు. శైలేష్ కొలను (Shailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ.. ‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్‌డేట్స్ (Updates) ఆకట్టుకోగా.. హిట్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ (Arjun Sarkar)గా నాని క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన గ్రిప్పింగ్ గ్లింప్స్ (Gripping Glimpses)కు సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ రాగా.. మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.
అయితే.. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ కశ్మీర్ (Kashmir)లో జరుగుతోంది. నాని, ఫైటర్ల బృందంపై కొన్ని కీలకమైన పోరాట సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. అలాగే పాత్రకు తగ్గట్టుగా నాని కూడా తన లుక్ టోటల్‌గా చేంజ్ చేసినట్లు తెలుస్తుండగా.. మూవీపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. కాగా సినిమాలో శ్రీనిధి శెట్టి (Srinidi Shetty) హీరోయిన్‌గా నటిస్తుండగా.. వచ్చే ఏడాది మే 1న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.