Jagdeep Dhankhar : జగ్‌దీప్ దన్‌ఖడ్‌పై అభిశంసన నోటీసు తిరస్కరణ..!

by Sathputhe Rajesh |   ( Updated:2024-12-19 16:18:32.0  )
Jagdeep Dhankhar : జగ్‌దీప్ దన్‌ఖడ్‌పై అభిశంసన నోటీసు తిరస్కరణ..!
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యసభ చైర్మన్‌గా జగదీప్ ధన్‌ఖడ్‌ను తొలగించాలని విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురైంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఈ మేరకు గురువారం ప్రకటించారు. వ్యక్తిగత కక్షతోనే అవిశ్వాసాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయన్నారు. దేశంలో రెండో రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. అవిశ్వాస తీర్మానం ఉపరాష్ట్రపతి ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందన్నారు. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కనీసం 14 రోజుల ముందు నోటీసు అవసరమని తెలిపారు. 60 మంది ఎంపీల సంతకం తప్పనిసరి అనే ఒకే ఒక్క ప్రొటోకాల్ మాత్రమే సరిగ్గా పాటించారని డిప్యూటీ చైర్మన్ తెలిపారు. ఈ నోటీసుపై చర్య తీసుకోలేమని వారికి తెలుసని ఆయన పేర్కొన్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవికి వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించడమే ఈ నోటీసు లక్ష్యం అన్నారు.

Next Story

Most Viewed