- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lagacharla : ఢిల్లీకి చేరుకున్న లగచర్ల లడాయి..రేపు ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు
దిశ, వెబ్ డెస్క్ : లగచర్ల(Lagacharla) ఫార్మా కంపెనీ పంచాయతీ ఢిల్లీ(Delhi)కి చేరింది. రాష్ట్ర ప్రభుత్వంపైన, పొలీస్ లపైన ఫిర్యాదు చేసేందుకు లగచర్ల ఫార్మా బాధితులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న క్రమంలో తాజాగా ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వికారాబాద్ కలెక్టర్ పైన, అధికారులపైన దాడికి పాల్పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో కలెక్టర్ పై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీస్ శాఖ స్థానిక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు గ్రామానికి చెందిన పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపింది. అయితే తమపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఫార్మా బాధితులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ (SC, ST Commission)ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఇదే క్రమంలో రేపు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ లకు, జాతీయ మానవహక్కుల కమిషన్ లకు కూడా రాష్ట్ర ప్రభుత్వంపైన, పొలీస్ లపైన ఫిర్యాదు చేసేందుకు లగచర్ల ఫార్మా బాధితులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో లగచర్ల గిరిజన కుటుంబ సభ్యులతో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఢిల్లీకి చేరుకున్నారు. రేపు సోమవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పైన, పోలీసులపైన వారు ఫిర్యాదు చేయనున్నారు.