రాజధాని పనులకు ముహూర్తం ఫిక్స్.. 23 నుంచి టెండర్ల ప్రక్రియ

by srinivas |
రాజధాని పనులకు ముహూర్తం ఫిక్స్.. 23 నుంచి టెండర్ల ప్రక్రియ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amaravati)ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం(Alliance Government) తీవ్రంగా కృషి చేస్తోంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ఒక్కొక్క నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు రాజధాని నిర్మాణ పనులకు జనవరి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ(Minister Narayana) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణ పున:ప్రారంభ పనులకు సోమవారం నుంచి టెండర్లు పిలుస్తున్నట్లు పేర్కొన్నారు. హడ్కో రుణంతో చేసే పనులు సంక్రాంతి తర్వాత చేపడతామన్నారు. ప్రపంచ బ్యాంకు(World Bank) రుణంతో జరిగే పనులకు 45 రోజుల సమయం పట్టొచ్చని తాము భావిస్తున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed