ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి : సీపీ ఎం. శ్రీనివాస్

by Aamani |
ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి : సీపీ ఎం. శ్రీనివాస్
X

దిశ, గోదావరిఖని: పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని, పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్ అన్నారు. రామ గుండం పోలీస్ స్టేషన్ ను పోలీస్‌ కమిషనర్‌ తనిఖీ చేశారు. గురువారం వార్షిక తనిఖీ లో భాగంగా కమిషనర్ మాట్లాడారు. పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును,రికార్డ్స్ పరిశీలించడం తో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను, గ్రేవ్ కేసెస్ లలో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల వివరాలు, కోర్ట్ లో పెండింగ్ లో ఉన్న కేసులు, వాటికి సంబందించిన దర్యాప్తు వివరాలను, రోడ్డు ప్రమాదాల నివారణకు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు సబ్ ఇన్స్ స్పెక్టరు ను అడిగి తెలుసుకున్నారు.

స్టేషన్ లో నిర్వహిస్తున్న పలురకాల రికార్డులను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే వారితో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్యతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలన్నారు. బ్లూ క్లోట్స్ సిబ్బంది డయల్ 100 కాల్స్ కి వెంటనే స్పందించి వారు సంఘటన స్థలానికి త్వరగా చేరుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, పిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి,మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. పోలీస్‌ కమిషనర్‌ గారు డీసీపీ , ఎసీపీతో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ తనిఖీల్లో పెద్దపల్లి డీజీపీ చేతన, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, రామగుండం ఎస్ఐ సంద్యారాణి, ఎన్టీపీసీ ఎస్ఉ ఉదయ్ కిరణ్, అంతర్గం ఎస్ ఐ వెంకట్ ఉన్నారు.

Advertisement

Next Story