ఎవరు లేని సమయంలో చోరీ

by Naveena |
ఎవరు లేని సమయంలో చోరీ
X

దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ పట్టణ శివారులోని సింగోటం చౌరస్తాలో రాజు నాయక్ ఇంట్లో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. తాళం వేసి కుటుంబ సభ్యులందురూ బుధవారం ఊరికి వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరు లేరని గమనించిన దొంగలు ఇంటి తాళాలను పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా తాళాలను తొలగించి అందులో ఉన్న నాలుగు తులాల బంగారు వస్తువులు, రూ,50వేల నగదు, 15 తులాల వెండిని అపరించుక వెళ్లారు. ఊరి నుంచి గురువారం ఉదయం ఇంటికి రాగా..బీరువాలో భద్ర పరిచిన విలువైన బంగారు,వెండి, వస్తువులు, నగదు లేకపోవడంతో ఇంటి యజమాని రాజు నాయక్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి క్లూస్ టీం ను తెప్పించి పరిశోధించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హృషికేశ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed