BRS: కేటీఆర్‌పై నాన్ బెయిలబుల్ కేసు.. స్పందించిన హరీష్ రావు

by Gantepaka Srikanth |
BRS: కేటీఆర్‌పై నాన్ బెయిలబుల్ కేసు.. స్పందించిన హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై నమోదైన కేసులపై ఆ పార్టీ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) స్పందించారు. గురువారం ఆయన అసెంబ్లీ(Assembly)లో మాట్లాడారు. కేటీఆర్‌పై కేసు నమోదును ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం కోసం పనిచేస్తే కేసు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని అన్నారు.

ఫార్ములా వన్‌(Formula One)పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌(Formula-E car racing) వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో..ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్‌ శాంతి కుమారి(CS Shanthi Kumari) ఏసీబీ(ACB)కి లేఖ రాశారు.

Advertisement

Next Story