Rathasaptami : రాష్ట్ర పర్వదినంగా అరసవెల్లి రథసప్తమి : ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

by Y. Venkata Narasimha Reddy |
Rathasaptami : రాష్ట్ర పర్వదినంగా అరసవెల్లి రథసప్తమి : ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం అరసవెల్లి రథసప్తమి(Arasavalli Rathasaptami) పర్వదినాన్ని రాష్ట్ర పర్వదినంగా(State Festival)ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం విడుదల (AP government orders) చేసింది. అరసవెల్లి రథసప్తమిని రాష్ట్ర స్థాయి పర్వదినంగా 3రోజుల పాటు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 4వ తేదీన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథ సప్తమి వేడుకలను దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది.

రథ సప్తమి సూర్య భగవానుడు “శ్రీ సూర్యనారాయణ స్వామి” పండుగ. ఈ పర్వదినాన్ని రథసప్తమి లేదా మాఘ సప్తమి అని కూడా పిలుస్తారు. సూర్యదేవుడి జన్మదినంగా ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు.

Advertisement

Next Story

Most Viewed