ఇందిరమ్మ ఇళ్ల సర్వే వేగవంతం చేయండి

by Naveena |
ఇందిరమ్మ ఇళ్ల సర్వే వేగవంతం చేయండి
X

దిశ , గాంధారి : ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. గురువారం గాంధారి మండలం పిస్కిల్ గుట్ట తండాలో స్థానిక అధికారులు చేస్తున్న సర్వేను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులైన లబ్దిదారుల వివరాలు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆన్లైన్ లో పొందుపర్చలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ రాజేశ్వర్, నాయబ్ తహసీల్దార్ రవి, ఎంపీఓ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు..

Advertisement

Next Story