Vijayawada:ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు.. అందుబాటులోకి ప్రత్యేక యాప్‌!?

by Jakkula Mamatha |
Vijayawada:ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు.. అందుబాటులోకి ప్రత్యేక యాప్‌!?
X

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడ(Vijayawada) కనకదుర్గమ్మ(Kanakadurgamma) అమ్మవారిని దర్శించుకోవాడానికి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) వస్తుంటారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో ఆలయంలో ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక(Karnataka), తమిళనాడు(Tamilnadu) నుంచి లక్షలాదిగా అమ్మవారికి ఇరుముళ్ళు సమర్పించడానికి తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఆలయ పరిధిలోని పూర్తి సమాచారం తెలిసేలా భవానీ దీక్ష 2024 పేరుతో ప్రత్యేక యాప్‌ను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ యాప్ గురించి ఆలయ ఈవో రామారావు(EO Ramarao) మీడియాకు వెల్లడించారు. క్యూ లైన్ల ఏర్పాట్లు వెయింటిగ్‌ హాళ్ళు, పార్కింగ్‌ స్థాలాలు, లడ్డూప్రసాదం, అన్నప్రసాదాల పంపిణీ వంటి వివరాలు యాప్‌ ద్వారా భక్తులకు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక టీమ్‌లను సిద్ధం చేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్(Download) చేసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ యాప్‌లో 24 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని ఈవో చెప్పారు. భవానీ దీక్ష విరమణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed